శుద్ధి యంత్రం ఆవిష్కరణ
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక సిద్ధార్థ నగర్ లో ఉన్న రాధా డిగ్రీ కళాశాల నందు మంచినీటి శుద్ధి యంత్రం ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల కరస్పాండెంట్ కాకుమాను వెంకట రాధాకృష్ణమూర్తి నిర్వహించారు. రాధా డిగ్రీ కళాశాల యందు గల విద్యార్థినీ విద్యార్థుల సౌకర్యార్థం పానుగంటి కోటేశ్వరరావు మరియు సుశీల వారి ఆర్థిక సహాయంతో కళాశాల ఆవరణ యందు నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పానుగంటి రామారావు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్.కె ఇస్మాయిల్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్వాహకులు కాకుమాను వెంకట రాధాకృష్ణమూర్తి శ్రద్ధ గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం పాల్గొన్నారు