Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బ్రహ్మకుమారి సమాజ కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు

బ్రహ్మకుమారి సమాజ కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు

0

బ్రహ్మకుమారి సమాజ కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు

బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నూతన భవనానికి ఎమ్మెల్యే జీవీ శంకుస్థాపన

న్యూస్‌తెలుగు/ వినుకొండ  : బ్రహ్మకుమారి సమాజ కార్యక్రమాలకు ఎల్లవేళలా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్మించే ఆలయాలు, ధ్యానకేంద్రాల్లో అడుగుపెట్టే ప్రతిఒక్కరికీ సుఖం , శాంతి, ఆనందం, ఐశ్వర్యాలని అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని తెలిపారు. గుంటూరు అశోక్ నగర్ 5వ లైన్ లోని ప్రజాహిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నూతన భవన నిర్మాణానికి శనివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భవానీ అక్క తనలాంటి ఎంతోమందిని ఎంతో ప్రేమగా చూశారన్నారు. ఇక్కడ మంచి కేంద్రం ఉండాలని ఆమె సంకల్పం అన్నారు. అది నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అందరి సహకారం ఉంటే చాలా బావుంటుందని ఆకాంక్షించారు. ఈ యజ్ఞంలో తమవంతు సహకారం ఎక్కువ ఉండాలని ప్రతిఒక్కరు సంకల్పం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహాయజ్ఞంలో ఎవరు ఎంత ఎక్కువ భాగం తీసుకుంటే వారికి అంత ప్రయోజనం తప్పక ఉంటుందని తెలిపారు. అందుకోసం శివాలయంలో భాగం పంచుకోవడంతో పాటు పదిమందిని ఇందులో భాగస్వామ్యం చేయడం రెండూ చాలా అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో తాను భాగం పంచుకుంటున్నా అని, భవిష్యత్‌లో కూడా తన పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే జీవీ తెలిపారు. ఓం శాంతి బ్రహ్మకుమారి ప్రజాహిత విశ్వవిద్యాలయం లో తానొక శాశ్వతసభ్యుడిని అని గుర్తు చేశారు. ఇలాంటి శివాలయాలు నిర్మించేటప్పుడు భవిష్యత్‌లో తనసహకారం భవిష్యత్‌లో కూడా ఇంకా ఎక్కువగా ఉండాలని శివబాబాను ప్రార్థిస్తున్నా అన్నారు. ఆలయం నిర్మిస్తున్న ప్రాంతంలో తానుకొంత సేపు ధ్యానం చేసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించిందన్నారు. భవానీ అక్క, శివబాబా ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయన్నారు. ఇక్కడ శాంతి, సంతోషం, ప్రేమ, జ్ఞానం వారు అందించడం అలానే పవిత్రత, సంతుష్టత అన్నీ ఈ శివాలయం నుంచి ప్రతిఒక్కరికి అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడకు వచ్చేవారందరికి శివబాబా వాటిని అందిస్తారన్నారు. (Story : బ్రహ్మకుమారి సమాజ కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version