ఈనెల 26న ఏపీ జీఎన్‌ఏ రాష్ట్ర బేరర్లు ఎన్నికలు
ఎపీ జీఎన్‌ఏ ఎన్నికల నిర్వాహణాధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి
న్యూస్ తెలుగు/విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్(ఏపీ జీఎన్‌ఏ) ఎన్నికల్లో భాగంగా ఈనెల 26న ఏపీ జీఎన్‌ఏ రాష్ట్ర బేరర్లు ఎన్నికలు ఎపీ జీఎన్‌ఏ ఎన్నిక జరగనుందని ఎన్టీఆర్ జిల్లా కో`ఆపరేటివ్ అధికారి, ఏపీ జీఎన్‌ఏ ఎన్నికల నిర్వాహణాధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్ బైలాస్, ఏపీ సీఎస్ నిబందనలు`2001 ప్రకారం అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 26న విజయవాడ ఎంజీ రోడ్డులోని రాఘవయ్య పార్కు సమీపంలోని కృష్ణాజిల్లా కో`ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌లో ఉదయం 7గంటలకు చేపట్టే రాష్గ్ర ఆఫీస్ బేర్లు ఎన్నిక ప్రక్రియకు సబందించిన సమావేశానికి ఎన్నికైన జిల్లా యూనిట్లు ఆఫీస్ బేరర్లు హాజరుకావాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన ఒరిజినల్ డిక్లరేషన్ ఫారంతో పాటు ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. (Story : ఈనెల 26న ఏపీ జీఎన్‌ఏ రాష్ట్ర బేరర్లు ఎన్నికలు)