రజకులను అన్ని విధాలుగా ఆదుకోవాలి
రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు నరసింహులు.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రజకులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ పట్టణములోని ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన రజక వృత్తిదారుల సమైక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నరసింహులు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని, బీసీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, రజకులకు కాలిని ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా ఒక ధోబి ఘాటు తో పాటు కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. త్వరలోనే ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. మా సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తెలిపారు. తదుపరి ధర్నా కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రాము, పోతులయ్య, ముత్యాలు, రాము, ప్రకాష్, సి. రాము, మహిళలు ముత్యాలమ్మ, మంజుల ,సుగుణ, రేణుక, మస్తానమ్మ, చెన్నమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.(Story:రజకులను అన్ని విధాలుగా ఆదుకోవాలి)