ధర్మవరం చెరువుకు గంగపూజ
మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు, అభిమానులు.
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ఇటీవల రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ధర్మవరం చెరువుకు అత్యధికంగా నీరు చేరుతోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అభిమానులు అనుచరులు చెరువు కట్ట వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2017 సంవత్సరంలో ధర్మవరం చెరువులో ముళ్ళ చెట్లు వ్యర్థాలతో నిరుపయోగంగా ఉన్న ధర్మవరం చెరువును అప్పటి ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తన సొంత నిధులతో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వాటిని తొలగించడం జరిగిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో శ్రీశైలం డ్యామ్ నుండి హంద్రీనీవా కాలువ ద్వారా ధర్మవరం చెరువుకు పై నియోజకవర్గ ఎన్ని అడ్డంకులు సృష్టించిన కాలువ వందలాదిమంది పోలీస్ వారి నడుమ కాలువ గట్టలపై గస్తీ పెట్టి సూరన్న స్వయంగా తిరుగుతూ ధర్మవరం ప్రాంతం రైతన్నలు బాగుండాలన్న దృఢ సంకల్పంతో నీరును తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ధర్మవరం చెరువుకు గంగపూజ)