నరగాయపాలెంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ మండలం లోని నరగాయపాలెం రైతు భరోసా కేంద్రం నందు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా.. పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి జిల్లా వనరుల కేంద్రం, పల్నాడు జిల్లా నరసరావుపేట డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(డి డి ఏ) ఎం.శివకుమారి శిక్షణ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో డిడిఏ మాట్లాడుతూ ప్రస్తుతం సాగు చేస్తున్న కంది వరి మిరప మరియు పొగాకు పంటలలో ఎరువుల యాజమాన్యం మరియు సమగ్ర సస్యరక్షణ విధానాల గురించి తెలియజేయడమైనది. అలాగే ఈ కార్యక్రమం అనంతరం కంది పంట పొలాన్ని సందర్శించి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పొలాలలో నీరు నిలబడి ఉంటే వెంటనే బయటికి వెళ్ళబెట్టి 13.0.45 ను పై పాటుగా పిచికారీ చేయమనడం జరిగినది. అలాగే మిరపలో కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా శిక్షణ కేంద్రం శాస్త్రవేత్త వెంకట రాములు, మండల వ్యవసాయ అధికారి వినుకొండ మండలం కే అంజి రెడ్డి, మండల ఉద్యాన అధికారి షేక్ నబీ రసూల్, మరియు విఏఏ ఎస్ భార్గవి పాల్గొన్నారు. (Story : నరగాయపాలెంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం)