బిసిలు సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలి
రాష్ట్ర అధ్యక్షులు వెంకటరాములు
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : రాజ్యాధికారంలో వాటా కోసం బీసీలు సమైక్య పోరాటలకు సిద్ధం కావాలని, తరతరాలుగా అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన, బీసీలు రాజ్యాధికారంలో వాటా కోసం, సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రఅధ్యక్షుడు తాటిపాముల వెంకటరాములు పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని కార్యాలయంలో బిసి హక్కుల సాధన సమితి జిల్లా సమావేశానికి బత్తిని సదానందం గౌడ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటరాములు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశ జన గణనలో బీసీ కులగణన చేపట్టాలని, మంత్రివర్గంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదింప చేయనిచో, దేశవ్యాప్తంగా బీసీలఆగ్రహాన్నిచవిచూడవలసివస్తుందనిహెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, యుద్ధ ప్రాతిపదికన కులగణన పూర్తి చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచి, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల తక్షణమే విడుదల చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి ప్రసంగిస్తూ బీసీల డిమాండ్స్ పరిష్కరించకుంటే, పాలకులకు బీసీల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. అక్టోబర్ 28 హైదరాబాదులో జరగనున్న బీసీ రాష్ట్ర సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మోతే లింగారెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ , బీసీ నాయకులు జక్కురాజుగౌడ్,అనుకారిఅశోక్,ప్రవీణ్గౌడ్ ,రమేష్ ,కర్రేలక్ష్మణ్ ,మాలోతుశంకర్నాయక్ ,పోచయ్య ,బి .మల్లయ్య ,అంకుషావలి, కోరపల్లి రమాదేవి , దువ్వ కనక లక్ష్మి పాల్గొన్నారు.(Story:బిసిలు సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలి)