రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ఎంపిక
కబడ్డీ కోచ్ పృథ్వి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీ వివేకానంద స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్మవరం ఆర్డిటి క్రీడా మైదానంలో శిక్షణ పొందుతున్న కబడ్డీ క్రీడాకారులు ఈనెల 19వ తేదీన శనివారం ఆర్డిటి మెయిన్ స్టేడియం నందు ఎస్ జి ఎఫ్ అండర్-17 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కబడి కోచ్ పృథ్వి తెలిపినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి 29 వరకు రాయచోటిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపినారు ఎంపికైన క్రీడాకారులు లలో వి.పవన్, బి.నవ్య, స్టాండ్ బై గా సి.జయంత్, ఎం.విష్ణు, ఆర్. అస్మిత ఎంపిక కావడం జరిగిందని, తదుపరి రాష్ట్రస్థాయికి ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ఎంపిక)