వినతిపత్రాల కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో ని వివిధ జిల్లా కలెక్టర్లకు మరియు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్తల వినతి పత్రాల కార్యక్రమం జయప్రదం చేయండి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వైద్య మిత్రుల సమస్యల గురించి సోమవారం జరిగే వివిధ జిల్లాల గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మిత్ర కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ సంఘం మరియు దాని అనుబంధ సంఘాల ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ మరియు టీం లీడర్స్ జిల్లా మేనేజర్లు ఆఫీస్ అసోసియేట్ సంఘాలు అందరూ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టర్లకు మరియు జిల్లా సమన్వయకర్తలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి వినుకొండ సిఐటి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పిలుపునివ్వడం జరిగినది రాష్ట్రంలో 2000 మంది వైద్య మిత్రాలు మరియు జిల్లా మేనేజర్లు టీం లీడర్ 17 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని వారికి ఉద్యోగ భద్రత క్యాడర్ లేదని అతి తక్కువ వేతనంతో చేస్తున్నామని ఈనెల 23వ తారీకు జరగబోవు క్యాబినెట్ మీటింగ్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వైద్య మిత్రులకు సమాన పనికి సమాన వేతనం కేడర్ మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి మరియు వైద్యారోగ్య శాఖ మంత్రి మా సమస్యలను పరిగణలు తీసుకొని పరిష్కరించాలని లేనిపక్షంలో ఈ నెల 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యమిత్రాలు నిరవధిక సమ్మెకు దిగుతామని రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే హనుమంత్ రెడ్డి సిఐటియు టౌన్ మహిళ నాయకులు ఎం తిరుమల లక్ష్మి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్.కె రంజాన్ కి సిఐటి నాయకులు వెంకటేశ్వర్లు నవీన్ కుమార్ రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (Story : వినతిపత్రాల కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి)

