Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సాలూరు చరిత్రలో నిలిచిపోయేలా అందరం అభివృద్ధి చేసుకుందాం

సాలూరు చరిత్రలో నిలిచిపోయేలా అందరం అభివృద్ధి చేసుకుందాం

0

సాలూరు చరిత్రలో నిలిచిపోయేలా అందరం అభివృద్ధి చేసుకుందాం

న్యూస్ తెలుగు /సాలూరు :  ఈ ఐదేళ్లలో కూటమి ప్రభుత్వంలో సాలూరు చరిత్రలోనిలిచిపోయేలా అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ శ్రీ శివ సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
శనివారం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో అభివృద్ధి దిశలో శంకుస్థాపనలు చేస్తున్నా మనీ అన్నారు.
26వ తేది నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఆమె చెప్పారు.ప్రజలే మా బలం కార్యకర్తలే మా బలగం అని అన్నారు.దీపం పథకం ద్వారా ప్రతీ ఇంటికీ ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తామని అన్నారు.
ఏ ఎన్నికలలోనైన గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కార్యకర్తల సూచించారు.విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశంలో జరిగిన అంశాలను సమావేశంలో తెలియచేసారు. ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారని, మన సాలూరు నియోజకవర్గంలో కూడా నెలరోజుల పాటు జరిగే కార్యక్రమంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జి ,సాధికార సారథులు అందరూ పాల్గొని విజయవంతంగా 50 వేలు సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 2 లక్షలు నుండి 5 లక్షలు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 125 రోజులలో 16,500 డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు మంజూరు చేస్తున్నామని, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె తెలిపారు.నాలుగు రోజులుగా ఇప్పటికే నేనే ఉపముఖ్యమంత్రి అని భ్రమలో ఉన్న రాజన్నదొరగారు పత్రికా ముఖంగా మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా వున్నాయని, నీతీ నిజాయితీ గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నామని, గత ప్రభుత్వంలో ఇసుక దందా, మద్యం కుంభకోణాలు, భూదండాలు చివరికి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం ఉత్తరాలు కూడా అమ్ముకునేవారని, మీరు మా ప్రభుత్వం, మా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్ దేవ్ సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మ తిరుపతి రావు మండల అధ్యక్షుడు పరమేశు . మెంటాడ మండల అధ్యక్షులు చలుమూరు వెంకట్రావు మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణు పాచిపెంట మండల అధ్యక్షులు పిన్నింటి ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : సాలూరు చరిత్రలో నిలిచిపోయేలా అందరం అభివృద్ధి చేసుకుందాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version