టి ఎస్ యుటిఎఫ్ 6వ రాష్ట్రమహాసభల ను విజయవంతం చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి: ఈనెల 28 నుండి 30 వరకు నల్గొండ పట్టణంలో జరిగే టీఎస్ యుటిఎఫ్ ఆరవ విద్యా వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని బుధవారం వనపర్తి పాలిటెక్నిక్ ఆవరణంలో జిల్లా నాయకులు గోడపత్రికలను విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ రవి ప్రసాద్ గౌడ్,డి. కృష్ణయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ మహాసభల్లో విద్యారంగా ప్రతిష్టత కోసం, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం, బలోపేతం కోసం చర్చించనునట్లు వారున్నారు. మహాసభలకు హాజరై ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు ఓడి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.అదికసంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో టి ఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు కూడా బి.వెంకటేష్ ,హామీద్,పి.శ్రీనివాస్ గౌడ్,టి. తిమ్మప్ప లక్ష్మణ్ నాయక్,బక్కన్న,సూరయ్య, అయోధ్య రాములు,జి కృష్ణ ,నరసింహ,జే.గంగన్న, అక్బర్, గోపాల్,టీకే ప్రవీణ్, చిన్నస్వామి, అర్జున్ , రాములు తదితరులు పాల్గొన్నారు. (Story : టి ఎస్ యుటిఎఫ్ 6వ రాష్ట్రమహాసభల ను విజయవంతం చేయాలి)