కోట్ల కవిత ప్రయోగం ‘ మనసులోని కవితనై
న్యూస్‌తెలుగు/వనపర్తి : సుప్రసిద్ధ కవి, కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవితాను వర్తనం చేసిన మనసులోని కవితనై కవితా సంపుటిని ఆవిష్కరిస్తూ వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు కవిగా కోట్ల ప్రయోగశీలి అని అభినందించారు. పాత్రికేయులు ఆనందాచారి రాసిన సంపాదకీయాలను కవితను వర్తనం చేయడం కొత్త తరానికి ఎంతో స్ఫూర్తివంతమని పేర్కొన్నారు. మంచిరేవుల క్రాస్ రోడ్స్ లోని డ్యూవిల్లె క్లబ్ హౌస్ లో జరిగిన పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా వచ్చిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత్వాన్ని విశ్లేషిస్తూ నిత్య కవితా చైతన్య శీలి ఆని పేర్కొన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ రఘు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా అల ఓకగా వర్తమాన సమాజం మీద ఎంతో చిత్తశుద్ధితో కవిత్వాన్ని రాస్తున్న కవులలో కోట్ల ఒకరు అన్నారు. ఈ కావ్యాన్ని తనకు అంకితం చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ సుప్రసిద్ధ పాత్రికేయులు కటక్కోజ్వల ఆనందాచారి తన సంపాదకీయాన్ని కవితాను వర్తనం చేయడం తెలుగు సాహిత్యంలో ఒక ప్రయోగం అన్నారు. మిత్రునిగా ఈ కవితా సంపుటి తనకు అంకితం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కవితా సంపుటిని అనంతోజు మోహనకృష్ణ సమీక్షిస్తూ కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవితా రచనలో కొత్త తరానికి మార్గదర్శకత్వం వహిస్తున్నాడు అన్నారు. ఈ సభలో ఆత్మీయ అతిథులుగా కాసుల ప్రతాపరెడ్డి ముదిరాజు ప్రవీణ్ ఎంవి రాఘవరెడ్డి అరిగె రాజు తదితరులు పాల్గొన్నారు. (Story : కోట్ల కవిత ప్రయోగం ‘ మనసులోని కవితనై’)