అనాధాశ్రమంలో పండ్లు పంపిణీ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని 30 వార్డు కౌన్సిలర్ కనగానపల్లి రమాదేవి కుమార్తె కనగానపల్లి సింధు పుట్టినరోజు సందర్బంగా సోదరుడు వై ఎస్ ఆర్- రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకులు వేముల అమర్ నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం మండలం గొట్లూరు అనాధ ఆశ్రమం లో ఆపిల్ పండ్లు పంచి పెట్టారు. అనంతరం అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ అనాధశ్రమంలో ఇటువంటి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా అనాధాశ్రమం కు కావలసిన సౌకర్యాలు కూడా మున్ముందు తప్పక కలిగిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వ్యక్తి మానవతా విలువలు పెంచేలా సేవా కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కుటుంబ సభ్యులు కనగానపల్లి హిమ బిందు, తేజ, చందు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర దాతలకు కృతజ్ఞతలను తెలియజేశారు. (Story : అనాధాశ్రమంలో పండ్లు పంపిణీ )