బీసీ మహిళా నాయకురాలు జయశ్రీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి
బీసీ సంక్షేమ సంఘం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని మారుతీ రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపములు శనివారం జరగాల్సిన చేనేత ఆత్మీయ సమావేశం కొన్ని అనివార్య కారణాల వలన రద్దు కావడం అన్న సమాచారం పట్ల చింతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య పట్టణ అధ్యక్షులు బండి వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో బీసీల అభివృద్ధి జరగాలి అంటే పట్టణంలోని సీనియర్ బిసి మహిళా నాయకురాలు అయిన జయశ్రీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరడం జరుగుతున్నదని తెలిపారు. జయశ్రీ చేనేత పరిశ్రమలో ఎన్నో సేవలను కొనసాగించారని, జాతీయ చేనేత సంఘం నాయకురాలిగా సేవలు అందించి మంచి గుర్తింపు పొందడం జరిగిందని తెలిపారు. కావున ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా జయశ్రీకి ఎమ్మెల్సీ పదవి వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, ప్రధాన కార్యదర్శి జంగమన్న, సహాయ కార్యదర్శి బెల్లం తిరుపాలు, కోశాధికారి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : బీసీ మహిళా నాయకురాలు జయశ్రీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి)