భవానీ వార్డ్ 1997’ టీజర్ విడుదల చేసిన సత్యం రాజేష్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా: హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. థియేటర్లో అయినా ఓటీటీలో అయినా ఈ జానర్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా చూస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే ‘భవానీ వార్డ్ 1997’ చిత్రం రాబోతోంది. హారర్, థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు ‘భవానీ వార్డ్ 1997’ అనే చిత్రం ఆడియెన్స్ ముందుకు త్వరలోనే రానుంది. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను సత్యం రాజేష్ విడుదల చేశారు. అనంతర సత్యం రాజేష్ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుందని చెబుతూ టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
గాడ్ విల్ ప్రకారం.. మనిషి చనిపోయిన తరువాత సోల్ ఆ దేవుడి దగ్గరకు వెళ్లాలి.. అలా వెళ్లకపోతే.. ఆ సోల్ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుంది అనే డైలాగ్స్‌తో ప్రారంభమైన టీజర్.. ఆద్యంతం భయపెట్టేలా ఉంది. ఆ ఆత్మ ఏంటి? ఆ క్రైమ్ ఏంటి? అసలు ఇందులో సైకో విలన్ ఎవరు? అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను కట్ చేశారు.
ఈ మూవీకి అరవింద్ బి కెమెరామెన్‌గా పని చేసారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
నటీనటులు : గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : జీడీఆర్ మోషన్ పిక్చర్స్
నిర్మాత : చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా
దర్శకుడు : జీడీ నరసింహా
సంగీత దర్శకుడు : నిస్సి జస్టిన్
కెమెరామెన్ : అరవింద్. బి
పీఆర్వో : సాయి సతీష్ (Story : భవానీ వార్డ్ 1997’ టీజర్ విడుదల చేసిన సత్యం రాజేష్)