చేనేత చిప్పల చంద్రాయుడు జ్ఞాపకార్థం అనాధ ఆశ్రమంలో అన్నదానం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని శివానగర్ చేనేత ప్రముఖులు 1977 గవర్నర్ అవార్డు గ్రహీత చిప్పల చంద్రాయుడు జ్ఞాపకార్థం శనివారం గొట్లూరు అనాధ ఆశ్రమం లో అన్నదానం చేశారు. అనంతరం చిప్పల చంద్రా యుడు కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సేవా గుణాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని కుటుంబంలోని పెద్దలను గౌరవిస్తూ, తల్లిదండ్రులను ప్రేమతో పలకరించాల్సిన బాధ్యత కుటుంబంలోని బిడ్డల దేనిని తెలిపారు.ఈ కార్యక్రమం లో చిప్పల రఘురామ్, చిప్పల గోపాల్, చిప్పల చక్రధర్, చిప్పల భరత్, మరియూ చిప్పల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.దాతలకు ఆశ్రమం ఫౌండర్ ఎల్. ప్రఫుల్ల చంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు. (Story : చేనేత చిప్పల చంద్రాయుడు జ్ఞాపకార్థం అనాధ ఆశ్రమంలో అన్నదానం )