UA-35385725-1 UA-35385725-1

‘విశ్వం’ని సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ రుణపడి ఉంటాను

‘విశ్వం’ని సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ రుణపడి ఉంటాను

సక్సెస్ మీట్ లో హీరో గోపీచంద్ 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా :  మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్ తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
సక్సెస్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విశ్వం సినిమా అక్టోబర్ 11న రిలీజ్ అయినప్పుడు నుంచి ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంత బాగా సపోర్ట్ చేసిన మీడియాకి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ గారిని బ్లైండ్ గా నమ్మేశాను. చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నరేష్ గారు, పృద్వీగారు.. ఇలా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి యాక్టర్ ని చాలా ఇబ్బంది పెట్టాను.(నవ్వుతూ) వాళ్లంతా ఒకటే టేక్ లో ఫినిష్ చేసి వెళ్లేవారు. నావల్ల పదిటేకులు చేయాల్సి వచ్చింది. వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఆ రోజు నేను ఏదైతే ఫీలయ్యానో సేమ్ అదే థియేటర్లో ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ లో ఆడియన్స్ నవ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని సీన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో చిన్న పాప చాలా అద్భుతంగా నటించింది. ఆ పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తెరవెనక చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వర్డ్ ఆఫ్ మౌత్ అని వింటా ఉన్నాను. కానీ ఈ సినిమాకి చూశాను. ప్రేక్షకులు వోన్ చేసుకుంటే సినిమాని ఎంత దూరమైనా తీసుకెళ్తారని ఈ సినిమాతో నిరూపించారు. అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు
డైరెక్టర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా సినిమాని ఇంత బాగా సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ. ఈ సినిమాని ఎంతగానో ప్రేమించిన  ప్రేక్షకులందరికీ థాంక్యూ. ముఖ్యంగా ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ సినిమా త్రీ టైమ్స్ హైయర్ రెవెన్యూ సెకండ్ డే చేసింది. వీక్ డేస్ లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. దీని అంతటికి కారణం వర్డ్ అఫ్ మౌత్. ప్రేక్షకులకి థాంక్యూ సో మచ్.  నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా బలం కామెడీ అని అందరూ చెప్తారు. అది బిగ్ టైం వర్కౌట్ అయి ఇంత పెద్ద హిట్ కావడానికి ఒక ప్రధాన కారణం కావడం  సంతోషంగా ఉంది. ఇందులో పాప సెంటిమెంట్, మదర్ సాంగ్ ఫేవరెట్ అని ముందు నుంచి చెబుతున్నాను. ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చడానికి మదర్ ఎమోషన్, పాప ట్రాక్ చాలా పెద్ద రీజన్ అయింది. సినిమాలో యాక్షన్ బావుంది.. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఈరోజు ఎంత పెద్ద హిట్ అయిందని అనుకుంటున్నాను. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని పనిచేసారు. టెక్నీషియన్స్ అందరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. గోపి నాకు చాలా సపోర్ట్ గా నిలబడ్డాడు. నిజానికి ఇందులో మదర్ సాంగ్ పెట్టడానికి హీరో యాక్సెప్టెన్సీ కావాలి. తను చాలా మంచి మనసుతో ఆ సాంగ్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ సో మచ్. ప్రతి విషయంలో నేను ఏదనుకుంటే అది చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చిన గోపికి మనస్ఫూర్తిగా థాంక్స్. నరేష్ గారు గొప్ప ఎనర్జీ తో క్యారెక్టర్ చేశారు. అలాగే వెన్నెల కిషోర్, ప్రగతి గారు, పృథ్వి గారు,  సునీల్.. ఇలా చాలామంది ఆర్టిస్టులు అద్భుతంగా చేశారు. చేతన్ భరద్వాజ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎడిటర్ అమర్ ప్రాణం పెట్టి పని చేశాడు . నా రైటర్స్ టీం గోపి మోహన్, ప్రవీణ్, భాను నందు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నాతోపాటు కష్టపడి పనిచేశారు. ఫైనల్ గా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఏంటో ఈ సినిమాతో చూశాను. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మర్చిపోను. ఇంకా చూడని ప్రేక్షకులు సినిమా చూడాలి. 100% థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. థియేటర్స్ లో ఫ్యామిలీతో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఫ్యామిలీతో ఈ సినిమా మళ్లీ మళ్లీ చూస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వేణు దోనేపూడి గారు, విశ్వ ప్రసాద్ గారికి మరోసారి థాంక్స్ చెప్తున్నాను. అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు.
డాక్టర్ నరేష్ వికె మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పటినుంచి కొడతామని వినిపిస్తూనే ఉంది. అందరం అదే అనుకున్నాం. ఇవాళ దసరా ధమాకా హిట్ కొట్టాం. 2024 దసరా హిట్ అనేది ఈ సినిమాతో గుర్తుండిపోతుంది. గోపీచంద్ మాస్ హీరో. యాక్షన్ తో పాటు హ్యూమర్ రొమాన్స్ ని కూడా అంత అద్భుతంగా పండించగలరు. చాలా ప్రశాంతంగా ఉంటారు. పీపుల్ మీడియాలో ఫస్ట్ టైం పని చేయడం ఆనందంగా ఉంది. మ్యాంగో శ్యామ్ ఎపిసోడ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ క్యారెక్టర్ వరకు డైరెక్టర్ శ్రీనువైట్ల గారిని నేను ఫాలో అయిపోయాను. మంచి  టైమింగ్ ఉన్న డైరెక్టర్ దగ్గర పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు అందరం నవ్వుతూనే ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీ2024 దసరా బిగ్గెస్ట్ హిట్ గా విశ్వం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు.
అనిషా అంబ్రోస్ మాట్లాడుతూ.. మ్యారేజ్ తర్వాత చేసిన ఫస్ట్ సినిమా ఇది. నా మనసుకి చాలా దగ్గరయింది. రియల్ లైఫ్ లో నాకు కిడ్ ఉంది. ఇందులో  నేను చేసిన క్యారెక్టర్ వెరీ క్లోజ్ టు మీ. నన్ను ఈ క్యారెక్టర్ లో బిలీవ్ చేసిన శ్రీనువైట్ల గారికి థాంక్యూ సో మచ్.  ఈ సినిమా మా ఫ్యామిలీని చాలా హ్యాపీ చేసింది. నా  క్యారెక్టర్ ని అందరూ లవ్ చేస్తున్నారు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  శ్రీనువైట్ల గారికి, గోపీచంద్ గారికి, టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ సో మచ్’ అన్నారు.
యాక్టర్ పృద్వి మాట్లాడుతూ.. విశ్వం సినిమాకు యునానిమస్ గా అద్భుతమైన టాక్ వచ్చింది. నేను ఎక్కువ శ్రీనువైట్ల గారి సినిమాలు, గోపీచంద్ గారి సినిమాలలు చేశాను. గోపీచంద్ గారు చాలా మంచి మనసున్న వ్యక్తి. ఈ సినిమాలో గోపీచంద్ గారు ఇరగదీసారు. ఇందులో నా క్యారెక్టర్ చెప్పిన డైలాగ్స్ అన్ని వైరల్ గా వెళ్తున్నాయి.  శ్రీనువైట్ల గారు వందేళ్లు సినిమాలు ఇలాగే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు విశ్వ ప్రసాద్ గారు వేణు గారికి అద్భుతంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సినిమాల ఆకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, హీరో గారికి ప్రొడ్యూసర్స్ కి, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నేను పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది.  శ్రీనువైట్ల గారు నాకు ఇంత సపోర్టివ్ గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీనువైట్ల గారు నాకు ఇచ్చిన సపోర్ట్, కంఫర్ట్ జోన్ ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనతో పని చేయడం నాకు ఒక డ్రీమ్ లానే ఉంది. గోపీచంద్ గారు అంటే నాకు చాలా ఇష్టం. చాలా సపోర్టివ్ గా ఉంటారు.  డౌన్ టు ఎర్త్ నేచర్. ఆయన నన్ను ఇంతగా నమ్మి సపోర్ట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేన.  టీమంతా చాలా సపోర్ట్ చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్టులో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాతో పాటు బీమ్స్ కూడా ఒక పాట చేశారు. ఆ పాటని చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు. నా మ్యూజిక్ టీం అందరికీ థాంక్ యూ. సినిమాని ఇంత గొప్ప ఆదరిస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.
డీవోపీ గుహన్ మాట్లాడుతూ.. హీరో గోపి గారు, డైరెక్టర్ శ్రీనువైట్ల గారు ఫస్ట్ డే నుంచి ఈ సినిమా సక్సెస్ ని నమ్మారు. ఫైనల్ గా ఆ స్టేజ్ కి రావడం చాలా ఆనందంగా వుంది. డీఓపి గా డైరెక్టర్ గారు చేసే ప్రతి సీన్ కి ఫస్ట్ అడియిన్ నేనే.  సీన్ జరుగుతున్నప్పుడు ఆన్ స్పాట్ నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయావాడిని. వైట్లగారు కామెడీ తో పాటు ఎమోషన్స్ డీల్ చేయడంలో ఆర్టిస్టుల నుంచి మైన్యూట్ డీటెయిల్స్ ని అద్భుతంగా రాబట్టుకుంటారు. ఆయన చాలా పర్ఫెక్షనిస్ట్. ప్రతి షాట్ విషయంలో చాలా క్లియర్ గా ఉంటారు. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ థాంక్ యూ సో మచ్’ అన్నారు.
ఎడిటర్ అమర్ మాట్లాడుతూ.. శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఆయన సినిమాలు కి అసిస్టెంట్ గా పని చేశాను. నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమాలో నన్ను ఎడిటర్ చేసిన శ్రీను గారికి థాంక్యూ. మా హీరో గోపీచంద్ గారికి, మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, వేణు గారికి చాలా చాలా థాంక్యూ.   ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు’ అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics
UA-35385725-1