ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలకు అతీతంగా పని చేద్దాం
షాపూర్ గ్రామం ఆదర్శమవ్వాలి
పండుగొల్ల సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ పథకాల అమలులో ఖిల్లా ఘనపురం మండలం షాపూర్ గ్రామం అందరికీ ఆదర్శవంతంగా ఉండేలా ప్రభుత్వ పథకాల అమలు చేపడదామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. షాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పండుగొల్ల సాయన్న విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పండుగొల్ల సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు షాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం తో పాటు గ్రామం ప్రజలు ఎంతో ఐక్యతగా ఏర్పడి గ్రామంలో పండుగొల్ల సాయన్న లాంటి సాహస వీరుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. షాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని మొట్టమొదటగా గ్రామంలో ఇల్లు లేని నిరుపేదల ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ప్రజలంతా ఐక్యంగా ఉండి వారిని గుర్తించాలని ఎమ్మెల్యే గ్రామస్తులకు సూచించారు. అనంతరం గ్రామస్తులు నాయకులు ఎమ్మెల్యే కి శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలకు అతీతంగా పని చేద్దాం)