ఈనెల 19న జాబ్ మేళా నిర్వహణ
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట సురేష్ బాబు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 19వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జే. వెంకట సురేష్ బాబు, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కొరకు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ జాబ్ మేళా ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం- గుట్ట కింద పల్లి లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు కంపెనీల కొరకు ఈ ఉద్యోగం ఎలా నిర్వహిస్తున్నామని, ఇందులో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అందరూ కూడా అర్హులేనని తెలిపారు. నెలకు 15వేల రూపాయల నుండి 25 వేల రూపాయల వరకు జీతం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాదు, బెంగళూరులో ఉద్యోగము చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఆధార్ కార్డు, విద్య అర్హత పత్రాలు తీసుకొని 19వ తేదీ ఉదయం 9 గంటలకు హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9182288465కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. (Story : ఈనెల 19న జాబ్ మేళా నిర్వహణ)