Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అకాల మరణం చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం

అకాల మరణం చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం

0

అకాల మరణం చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : సిఐటియు ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో ఆకాల మరణం చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని అందించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం కార్మికులు నగదును అందజేశారు. ఇందులో భాగంగా నాగేంద్ర కుటుంబానికి 39,600/-, మల్లికార్జున కుటుంబానికి 35600/- మొత్తం కలిపి 75,200/- రూపాయల నగదును ఆర్థిక సహాయంగా వీరిఇద్దరి కుటుంబాలకు అందించడం జరిగింది అని జే.వి రమణ, సిఐటియు మండల కన్వీనర్ టి.అయూబ్ ఖాన్, కో కన్వీనర్,ఎస్ వెంకటేష్, మున్సిపల్ కార్మిక సంఘం శ్రీ సత్య సాయిజిల్లా అధ్యక్షులు,ఎం బాబు, పట్టణ అధ్యక్షులు,ముకుంద తెలిపారు. అనంతరం పట్టణ కార్యదర్శి మాట్లాడుతూ
ధర్మవరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ధర్మవరం పట్టణం లో పరిశుభ్రత కోసం పాటుపడిన కార్మికులు నాగేంద్ర. మరియు మల్లికార్జున. మరణించడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతో. తోటి కార్మికులు వారి వంతు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వంతో దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ కార్మికుల కుటుంబాలని ఆదుకోవడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా వారి కుటుంబాలు ఇబ్బందులకు గురికాకుండా ధర్మవరం మున్సిపాలిటీ అధికారులు స్పందించి వారిని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ ఓబులేసు, పుల్లన్న, చేన్నకేశవ. పెద్దక్క, కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు. (Story : అకాల మరణం చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version