మెడికల్ క్యాంప్, అన్నదానం కార్యక్రమాలు దైవ సేవతో సమానం
కన్వీనర్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాలు దైవ సేవతో సమానమని సుబ్బదాసు సత్రంలోని భగవాన్ శ్రీ సత్య సాయి సేవాసమితి-2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ప్రతినెల 24వ తేదీ నారాయణ సేవ (అన్నదానం), ప్రతి గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ, ప్రతినెలా 19వ తేదీ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. అదేవిధంగా 24వ తేదీన అన్నదానం తో పాటు మెడికల్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. తొలుత బాబా చిత్రపటాన్ని పట్టణంలోని పలు వీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సేవలో ప్రతిభ ఘనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు కూడా పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి నుండి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణమూర్తి తో పాటు అనేకమంది భక్తాదులు ఈ కార్యక్రమములో పాల్గొని, వారి ప్రసంగాలను తెలియజేసారని తెలిపారు. అదేవిధంగా పుట్టపర్తి సాయిబాబా ప్రసాదం కూడా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. (Story : మెడికల్ క్యాంప్, అన్నదానం కార్యక్రమాలు దైవ సేవతో సమానం)