పద్నాలుగు మంది రిమాండ్
కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం
న్యూస్ తెలుగు / కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఆదివారం రాత్రి కాగజ్‌నగర్‌లోని ఈఎస్ఐ వద్ద మరియు మేయిన్ మార్కెట్ ఫ్లైఓవర్ సమీపంలోని జ్యూస్ సెంటర్ వద్ద జరిగిన గొడవలో పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం వెల్లడించారు. ఈ గొడవలో పాల్గొన్న మరికొంత మందిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఎటువంటి సమస్యలు, గొడవలు చెలరేగినా ముందుగ పోలీసులకు సమాచారం అందజేయాలని చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోవడం నేరమని మతవిధ్వేశాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, మతసామరస్యానికి భంగం కలిగేలా వ్యవహరించినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(Story: పద్నాలుగు మంది రిమాండ్ )