ఘనంగా జరిగిన వసంత ఉత్సవం..
ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగ సత్య శ్రీనివాసులు, మోకా రవి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కెపిటి వీధిలో గల వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈనెల మూడవ తేదీ నుండి 15వ తేదీ వరకు దసరా శరన్నవరాత్ర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య సంఘం, ఆలయ కమిటీ, వాసవి మహిళా మండలి, ఆర్యవైశ్య యువజన సంఘం, అనుబంధ ల సంస్థల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఉదయం వసంతోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు అధ్యక్ష, కార్యదర్శులు నాగసత్య శ్రీనివాసులు, మోకా రవి, కోశాధికారి అంబటి అవినాష్, ఆర్. రెడ్డి వంశీరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది రోజులుగా నిర్వహించబడిన దసరా శరన్నవ రాత్రి ఉత్సవ వేడుకలకు కృతజ్ఞతగా వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే వాసవి మాతను ప్రత్యేకంగా అలంకరించి, మూల విరాట్ కు ప్రత్యేక పూజలను అర్చకులు ద్వారా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం పట్టణములో అమ్మవారిని ఊరేగింపుగా నిర్వహించడం జరిగిందన్నారు. ఒకరికొకరు వసంత్ వసంతాలను చెల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు.. తదుపరి కొత్త సత్రంలో విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుచేసి విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఆర్యవైశ్య కొత్త సత్రంలో అమ్మవారికి ఉయ్యాలో సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ఆర్యవైశ్య ఎఫ్బి షాప్ డీలర్స్ సేవాదాతలుగా వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ ఉయ్యాలో శివ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య లు మహిళలు పాల్గొన్నారు. వాసవి మహిళా మండలి వారిచే వాసవి సంగీత కీర్తనలు యొక్క ఆలాపనలు అందరిని ఆకట్టుకున్నాయి. మంగళవారం తో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. (Story : ఘనంగా జరిగిన వసంత ఉత్సవం.. )