ఘనంగా జరిగిన పారువేట, సైనోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని శ్రీనివాస నగర్ (గుడ్డి బావి వీధి) లోగల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈనెల మూడవ తేదీ నుండి 13వ తేదీ వరకు స్వామివారి శరన్న రాత్రుల ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 11వ రోజు స్వామివారిని పారువేట ఉత్సవములో భాగంగా పట్టణములోని పురవీధులలో ఊరేగింపులు నిర్వహించారు. తొలుత అర్చకులు రాజేష్ ఆచార్యులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయంలో చివరి వేడుకల్లో భాగంగా సయనోత్సవ కార్యక్రమం దాతలు, భక్తాదులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సేవాకర్తలుగా శంకు వరలక్ష్మి శంకు నాగరాజు జ్ఞాన ప్రసన్న జ్ఞాన ఐశ్వర్య రేపటి పాండురంగ రేపటి సువర్ణ కమల సాయిలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాకర్తలకు ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలుపుతూ, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శరన్నవరాత్రుల ఉత్సవ నిర్వహణ కమిటీ కన్వీనర్ జింక రాజేంద్రప్రసాద్, కోశాధికారి చెన్నం శెట్టి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన పారువేట, సైనోత్సవ వేడుకలు)