Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సిపి సీనియర్ జూనియర్ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్డు పండ్లను అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ధర్మవరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి, తన సత్తా నిరూపించారని తెలిపారు. ఓటమి పాలు అయినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడన్నపల్లి నరసింహులు, వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు బాల్ రెడ్డి, జెసిబి రమణ, సుభాహాన్, వడ్డే బాలాజీ, చౌడప్ప, దేవరకొండ రమేష్, రాఘవ, అంజి, రామాంజనేయులు, హరి, మల్లికార్జున, రమేష్, వైయస్సార్సీపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, చందు తదితరుల నాయకులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!