ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ
ధర్మవరం ఎక్సైజ్ డివిజన్ పరిధిలో 2009 దరఖాస్తులు.. ఎక్సైజ్ చంద్రమణి
న్యూస్ తెలుగు / ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఇందులో భాగంగా ధర్మవరం ఎక్సైజ్ డివిజన్ పరిధిలో 219 దరఖాస్తులు రావడం జరిగిందని ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం అర్బన్ పరిధిలో 116రూరల్ పరిధిలో 13 బత్తలపల్లి మండలంలో33, తాడిమర్రి మండలంలో 9, ముదిగుబ్బ మండలంలో48 వెరసి 219 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఈనెల 14వ తేదీన పుట్టపర్తిలో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లాటరీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం అమలులోకి రానున్నదని తెలిపారు. అన్ని రకాల బ్రాండ్లకు చెందిన చీప్ లిక్కర్ కేవలం 99 రూపాయలకే అందిస్తున్నట్టు వారు తెలిపారు. (Story : ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ)