UA-35385725-1 UA-35385725-1

భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు నివాళి

భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు నివాళి

సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్

న్యూస్‌తెలుగు/ పల్నాడు జిల్లా, వినుకొండ: భారతదేశ పారిశ్రామికవేత్తల్లో మంచి చరిత్ర కలిగినటువంటి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు నివాళులర్పించిన సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్. మనదేశంలో గత శతాబ్ద కాలంగా టాటా సంస్థలు దేశ అభివృద్ధిలో కీలకమైన పారిశ్రామిక సంస్థలుగా పేరుపొందాయని ముఖ్యంగా రతన్ టాటా ఆ సంస్థకి 22 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్న కాలంలో సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారని అలాగే దేశంలో లక్షలాదిమందికి ఉద్యోగ వసతులు కల్పించుటలో ప్రముఖ పాత్ర ఆ సంస్థకు ఉన్నదని ఆయన అన్నారు. దేశాభివృద్ధికి సహకరించుటలో గుండు సూది నుండి రైలు ఇంజన్లు అనేక ప్రాజెక్టులకు మిషనరీ సామాన్లు తయారుచేసిన గొప్ప పరిశ్రమ టాటా సంస్థ అని ఆయన అన్నారు. రతన్ టాటా సంస్థకు వచ్చిన ఆదాయంలో 60 శాతం ట్రస్టుకు బదలాయించి అనేక ప్రజాహిత కార్యక్రమాలకు పేద ప్రజలకు సమాజ సేవకు ఉపయోగించే విధంగా డబ్బును ఖర్చు చేసి ప్రజాసేవలో పేరు ప్రతిష్టలు సంపాదించారని ఆయన అన్నారు. దేశంలో అనేకమంది లక్షల కోట్లు సంపాదించిన గొప్పవారు ఉన్నారు కానీ టాటా సంస్థ అధినేతగా రతన్ టాటా కు వచ్చిన మంచి పేరు ఎవరికి లేదని ఆయన అన్నారు. డబ్బు సంపాదించడమే కాదు దానిని సద్వినియోగం చేసి దేశ సేవకు ప్రజాసేవకు ఉపయోగించిన వారు దేశ ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోతారని తెలుపుతూ ఆయనకు ఘనంగా నివాళులర్పించి సంతాపాన్ని ప్రకటించారు. (Story : భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు నివాళి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1