తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అదనపు కలెక్టర్ రెవెన్యూ మహిందర్ జి అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ నేతృత్వం, టి ఎన్ జి ఓ ఎస్ ఆద్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ బతుకమ్మ ఉత్సవంలో మహిళా ఉద్యోగులు వివిధ రూపాల్లో అలంకరించిన బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ పాటలు పాడి, ఆడి కలెక్టరేట్ కు పండుగ శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు బతుకమ్మ పండుగ లో కనబడుతున్నాయి. బతుకమ్మ అంటే ఒక శక్తి. శక్తిని పూల ద్వారా పూజిస్తూ తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. ప్రతిరోజూ మహిళలకు ఒక పండుగ రోజు కావాలి. ఈ ఉత్సవాల్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందిఅన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి అదనపు కలెక్టర సంపత్ రావ్ , జిల్లా కల్లెక్టరేట్ ఎఓ. రాజుకుమార్, ములుగు తాసిల్దారు విజయ్ భాస్కర్, డి డబ్ల్యు ఓ శిరీష , టి ఎన్ జి ఓ ఎస్ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, జిల్లా కార్యదర్శి మేడి చైతన్య , అసోసియేషన్ అద్యక్షులు రాజేశ్వర్ రావు, కోశాధికారి లాల్ నాయక్, జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. (Story : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ)