Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ నుంచి గుంటూరుకు గంటలో చేరే రహదారుల అభివృద్ధి

వినుకొండ నుంచి గుంటూరుకు గంటలో చేరే రహదారుల అభివృద్ధి

0

వినుకొండ నుంచి గుంటూరుకు గంటలో చేరే రహదారుల అభివృద్ధి

వినుకొండ డిపోలో 4 నూతన బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన

న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి ఆర్టీసీ, రహదారులు, మౌలికవసతుల అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి పెట్టిందని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీకి వారంవారం కొత్తబస్సులు, వినుకొండ నుంచి గుంటూరు గంటలోనే చేరుకునే నాలుగువరసల రహదారి నిర్మాణాన్ని ప్రారంభించుకోబోతున్నామన్నారు. వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కి.మీ. హైవేను 4 వరసలుగా విస్తరించబోతున్నామని, తద్వారా ప్ర యాణ సమయంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయన్నారు. ఆదివారం వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 4 కొత్త బస్సులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన వందరోజుల్లో దాదాపు ప్రతి వారం నూతన బస్సులు ప్రారంభించామన్నారు. వినుకొండ డిపో నుంచే 25 కొత్త బస్సులను ప్రారంభించామని, అద్దె బస్సులు పెట్టే వారినీ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం డొక్కుబస్సులను షెడ్డుకు పంపి రాష్ట్రవ్యాప్తంగా 300కి పైన కొత్త బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చిందన్నారు ఎమ్మెల్యే జీవీ. మాచర్ల నుంచి చెన్నైకు బస్ సర్వీసు ఏర్పాటు చేశామని, వినుకొండ, మాచర్ల నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కు రెండు బస్సులు నడుపుతున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం అదనంగా బస్ సర్వీసులతో ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. భవిష్యత్తులో రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్లతో వినుకొండ డిపోను ఆధునీకరిస్తామన్నారు. శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ సిబ్బంది క్వార్టర్స్ పైనా అధికారులతో చర్చిస్తామని, అవసరమైతే పడగొట్టి కొత్తవి కట్టిస్తామన్నా రు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆర్టీసీ పట్టించుకోకపోవడం మాత్రమే కాక ఎక్కడా కొత్త రోడ్డన్నది వేయలేదని, కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోయారని మండిపడ్డారు. త్వరలోనే వినుకొండ -గుంటూరు మధ్య 4 వరసల రహదారిలానే వినుకొండ నుంచి అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిని చేరుకునే రహదారిని 2వరసలుగా విస్తరించే ఆలోచనలో ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబు దిల్లీ వెళ్లినా ప్రతిసారీ రాష్ట్రానికి ఏదొక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు ఏమైతే హామీలు ఇచ్చారో వాటన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, రూ.3 వేల పింఛన్‌ను రూ.4 వేలు చేశారని, ఒక్క సంతకంతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించారని, త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించబోతున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికి కూడా వినుకొండలో షాదీఖానాకు రూ.3 కోట్లు, రామలింగేశ్వరస్వామి గుడికి రూ.2 కోట్లు, ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి, టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు ఇచ్చారని, వినుకొండ, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిధులు తీసుకొచ్చానని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పత్తి పూర్ణచంద్రరావు, పెమ్మసాని నాగేశ్వరరావు, బత్తల గోవిందరాజులు, సోమేపల్లి శ్రీనివాసరావు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.(Story:వినుకొండ నుంచి గుంటూరుకు గంటలో చేరే రహదారుల అభివృద్ధి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version