Home వార్తలు తెలంగాణ వెంకటస్వామి నిస్వార్థ ప్రజా సేవకుడు : రఘు

వెంకటస్వామి నిస్వార్థ ప్రజా సేవకుడు : రఘు

0

వెంకటస్వామి నిస్వార్థ ప్రజా సేవకుడు : రఘు

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : వెంకటస్వామి నిస్వార్థ ప్రజా సేవకుడు అని, కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం మండల కమిటి అధ్యక్షులు సి హెచ్. రఘు అన్నారు. వెంకటస్వామి జయంతి సందర్బంగాశనివారంఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కార్యాలయంలో అయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా చిటమట రఘు గారు మాట్లాడుతూ స్వర్గీయ జి వెంకటస్వామి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించడం హర్షించదగిన విషయం అన్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు కోసం వెంకటస్వామి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను నేటి తరాలకు అస్త్రశమని తెలిపారు. స్వర్గీయ జి వెంకటస్వామి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ శాఖల మంత్రిగా పని చేశారని, ప్రజలకు విశేష సేవలు అందించారని ఆయన త్యాగం, అంకితభావం,సామాజిక న్యాయం కోసం చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగు రిపోర్టర్ జూపాక కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వావిలాల ఎల్లయ్య, కర్నె సత్యం, ఈసం యాదయ్య, వంగపండ్ల రవి, చేల వినయ్ కుమార్, పోలెబోయిన గోపాల్, చెన్నం ఎల్లయ్య, బెడిక రమేష్ కొఠారి బాణయ్య తదితరులు పాల్గొన్నారు.  (Story : వెంకటస్వామి నిస్వార్థ ప్రజా సేవకుడు : రఘు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version