పేకాట స్థావరం పై పోలీసుల దాడి
ఐదుగురిపై కేసు నమోదు
న్యూస్ తెలుగు/ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ; పేకాట స్థావరం పై కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. టౌన్ ఎస్ఐ సుధాకర్ తెలిపున వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌లో ని నౌగాం భస్తిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు శనివారం టౌన్ సీఐ తుత్తూరు శంకరయ్య గారి ఆదేశాల మేరకు టౌన్ ఎస్ఐ సుధాకర్ సిబ్బంది తో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో నౌగాం భస్తికి చెందిన మొహమ్మద్ హనీఫ్ ఇంటిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని( మొహమ్మద్ హనీఫ్, మొహమ్మద్ లతీఫ్, షేక్ రియాజ్, బండ పరమేశ్వర్, చిలుమల వేంకటస్వామి) అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.13070 నగదుతో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధిపర్చుకుని వారిని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… కాగజ్‌నగర్ టౌన్ లో పేకాట, జూదం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (Story : పేకాట స్థావరం పై పోలీసుల దాడి)