Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వన్య ప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన సదస్సు.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి.

వన్య ప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన సదస్సు.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి.

0

వన్య ప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన సదస్సు.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి.

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎన్.ఎస్. ఎస్. విభాగాలతో పాటు అటవీ శాఖ (బుక్కపట్నం) వారి సంయుక్త సౌజన్యం తో స్వర్ణాంధ్ర2047లో అంతర్భాగంగా చివరి రోజు కార్యక్రమంగా వన్య ప్రాణుల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శ్రీ సత్యసాయి జిల్లా – బుక్కపట్నం అటవీ క్షేత్రంనుండి ఫారెస్ట్ డెప్యూటి రేంజ్ ఆఫీసర్ కె. హుసేనప్ప విచ్చేశారు .విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ వన్య ప్రాణుల, జంతువుల పట్ల ప్రేమ, దయతో మెలగాలని , అటవీ సంపదను సంరక్షించాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా వాటికి అవసరమైన మంచి వాతావరణాన్ని కల్పించాలని కోరారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి పావనిఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ పర్యవేక్షణ లో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది అక్కులప్ప, సునంద, పుల్లప్ప, అధ్యాపకులు త్రివేణి , చిట్టెమ్మ, షమీవుల్లా, కిరణ్ కుమార్ , భువనేశ్వరి, హైమావతి, పుష్పవతి , సరస్వతి బి. ఆనంద్, మీనా, నాగరాజు. ధనుంజయ, బోధననేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.(Story:వన్య ప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన సదస్సు.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి.)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version