ఉద్యోగం పేరిట నిరుద్యోగికి కుచ్చు టోపీ
రూ. 1,43 లక్షలకు టోకారా
గుర్తుతెలియని వ్యక్తులకు వివరాలు వెల్లడించవద్దు-సీఐ వినోద్ కుమార్
న్యూస్ తెలుగు /హైదరాబాద్ : నౌకరి యాప్ నమోదు తో ఉద్యోగమని నమ్మబలికి.. ఓ నిరుద్యోగునికి కు చ్చుకోకు పెట్టిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ సిఐ వినోద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ చెందిన వాసవి (21) ఇటీవల ఫార్మసీ పూర్తి చేసింది. ఉద్యోగ అన్వేషణలో భాగంగా నౌకరి యాప్ లో పార్ట్ టైం జాబ్ కు పేరు నమోదు చేసుకుంది. పేరు నమోదు చేసుకున్న అదేరోజు గుర్తుతెలియని ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఉద్యోగం కు సెలెక్ట్ అయ్యారని.. బ్యాంకు వివరాలు చెప్పాలని సదరు నిందితుడు కోరాడు. తన బ్యాంకు ఖాతా పూర్తి వివరాలను సదరు మోసగాడికి తెలియ చెప్పింది. యూపీఐ ఐడి ద్వారా 13 బ్యాంకు ట్రాన్జక్షన్స్ లో రూ. 1,43,500 బాధితురాలు ఖాతా నుంచి నిందితుడి ఖాతాలోకి జమా అయ్యాయి. దీంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి.. ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తుతెలియని వ్యక్తులకు వివరాలు వెల్లడించవద్దు ఎల్బీనగర్ సిఐ వినోద్ కుమార్ ఆన్లైన్ ద్వారా వివిధ రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సిఐ వినోద్ కుమార్ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు తన బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించవద్దని సూచించారు. (Story : ఉద్యోగం పేరిట నిరుద్యోగికి కుచ్చు టోపీ)