కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మునికి నివాళులు
న్యూస్తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణం నందు మన జాతి పిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెన్నా శ్రీనివాసరావు. ఈ సందర్బంగా వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెన్నా శ్రీనివాసరావు మట్లాడుతూ. బీజేపీ పరిపాలనలో దేశం అతలాకుతలం అయి సామాన్యుల బ్రతుకు కష్టతరంగా మరిందని, నిరుద్యోగులకి ఉద్యోగం లేదు ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు పంచుకుంటు వారి కి వరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. రాష్ట్రం లో కుటమీ ప్రభుత్వం వృద్యప్య పెన్షన్ ని 4000 చేసినట్టే చేసి ప్రతి సచివాలయానికి 100 పింఛన్లు తొలగించలని సచివాలయం ఉద్యోగులకు ఆదేశాలు పంపించారు. ఇప్పటికే చాలామంది పెన్షన్లు కోల్పోయి ఉన్నారు. ఎవరికైనా సరే పెన్షన్లు కోల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ తరపున మేము అండగా ఉంటాం మీ తరఫున మేము పోరాటం చేసి మరల మీ పెన్షన్లు ప్రభుత్వ పథకాలను మీకు వచ్చేలా కృషి చేస్తామని చెన్నా శ్రీనివాసరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో చెన్నంశెట్టి మణికంఠ, పత్తి మణికంఠ, పోతుల దుర్గ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దుప్పలపూడి శ్రీనివాస్, పవన్ సాయి, తదితరులు పాల్గొన్నారు. (Story : కాంగ్రీస్ ఆధ్వర్యంలో మహాత్మునికి నివాళులు)