మహాత్మా! బీజేపీ ఫాసిస్ట్ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడు : కాంగ్రెస్
గాంధీ జయంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా! ” బీజేపీ ఫాసిస్ట్ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడు ” అనే నినాదంతో డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు అధ్యక్షతన జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి బీజేపీ విభజించు పాలించు విధానం పై నిరసన వ్యక్తం చేసారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోరాటాలు, ప్రాణ త్యాగాలతో ఏర్పడిన ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని, ఈ పోరాటంలో కాంగ్రెస్ ముందుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసి, పీవీ నరసింహ రావు జాతికి అంకితం చేస్తే, మన్మోహన్ సింగ్ సర్కార్ ఈ ప్లాంట్ విస్తరణకు కృషి చేసిందని, విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావించే ఉక్కు పరిశ్రమలో 4000 కాంట్రాక్టు లేబర్ కి నోటీసు ఇవ్వడం, గుర్తింపు కార్డులు రద్దు చేయడం దారుణమని, ఇప్పటికే వారికి 5 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని, వారు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని షర్మిల అన్నారు, తరువాత ఆమె స్టీల్ ప్లాంట్ కి వెళ్లి రోడ్డు మీద బెటాయించి రాస్తా రోకో చేసారు, బాధిత కార్మికులకు అండగా ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్టు కార్మికులకు 48 గంటలలో భరోసా ఇవ్వకపోతే అక్టోబర్ 4 మధ్యాహ్నం 1 గంటకు నిరాహార దీక్షకు దిగుతానని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు వేగి వెంకటేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్,సీనియర్ నాయకులు కేవీఎస్, సోడాదాస్ సుధాకర్, సత్యా రెడ్డి, ప్రియాంక దండి, గుత్తుల శ్రీనివాస్, కేవీ లక్ష్మి,చిన్న బాబు, సంతోష్,గంగాధర్, ఆలీ, కస్తూరి వెంకట్ రావు,యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు,జిల్లా అధ్యక్షులు సతీష్, శివకుమార్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. (Story : మహాత్మా! బీజేపీ ఫాసిస్ట్ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడు : కాంగ్రెస్)