ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు /వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వనపర్తి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం కోసం తన ప్రాణాన్ని అర్పించారు.. మన దేశాన్ని స్వతంత్రం వైపు నడిపించి స్ఫూర్తిదాయకంగా నిలిచి స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహాత్ముడి సేవలను దేశమంతా స్మరించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తైలం శంకర్ ప్రసాద్ , మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ తిరుపతయ్య ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సతీష్ యాదవ్, కౌన్సిలర్ బ్రహ్మచారి , రామ్ రెడ్డి , దేవన్న , మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. (Story : ఘనంగా గాంధీ జయంతి వేడుకలు)