Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జిల్లాకు ఎంపికైన గుడ్ షెఫర్డ్ విద్యార్థులు

జిల్లాకు ఎంపికైన గుడ్ షెఫర్డ్ విద్యార్థులు

0

జిల్లాకు ఎంపికైన గుడ్ షెఫర్డ్ విద్యార్థులు

న్యూస్‌తెలుగు/ వినుకొండ : గత నెల 28 తారీఖున చిలకలూరిపేటలో ఏ ఏం జి స్కూల్ లో నిర్వహించిన ఉమ్మడి గుంటూరుజిల్లా బాస్కెట్బాల్ అండ్ 14 ,17అండ్ 19 సెలెక్షన్స్ లో గుడ్ షెఫర్డ్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ఏకంగా ఆరుగురు గుంటూరు జిల్లా టీం కి ఎంపికయ్యారు. అలాగే 30వ తారీకున నరసరావుపేట మున్సిపల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన గుంటూరు జిల్లా బాలికల జట్టు సెలక్షన్స్ లో పాల్గొని ముగ్గురు విద్యార్థులు గుంటూరు జిల్లా టీం కి ఎంపికయ్యారు. వారు U14 బాయ్స్ విభాగంలో అఖిల్, మనోహర్, పవన్, యోగేశ్వర్రావు U14 గర్ల్స్ విభాగంలో పవిత్ర, జోషిత. U17 విభాగంలో హాసిని U19 విభాగంలో.భార్గవి, తేజేస్వినిలు ఎంపికయ్యారు. అలాగే ఈనెల27న వాసవి క్లబ్ నరసరావుపేట వారు పల్నాడు జిల్లా స్థాయిలో బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించారు. అందులో పాల్గొని ద్వితీయ బహుమతిని సాధించారు. స్కూల్ ప్రిన్సిపాల్ జి.లక్ష్మీ సునీత అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తను మాట్లాడుతూ. వినుకొండలో సుమారు 7 లక్షల రూపాయలతో ఉన్నత ప్రమాణాలతో బాస్కెట్బాల్ కోర్టును పాఠశాలలో ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా బాలురుతో పాటు బాలికలను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు . చదువులతో మానసికంగా కృంగిపోతున్న విద్యార్థులకు క్రీడల ద్వారా ఉల్లాసం, ఉత్సాహం పెంపొందించుకోవాలంటే ఈ యొక్క క్రీడల్లో కనీసం రోజులొ ఒక గంట అయినా ప్రతి ఒక్కరు ఆడాలని సూచించారు. అలా విద్యార్థులు అన్ని క్రీడలలో సాధన చేస్తూ ఈ సంవత్సరం బాస్కెట్బాల్ క్రీడలలో ఏకంగా 9 మంది క్రీడాకారులు, అందులో నలుగురు బాయ్స్, ఐదుగురు బాలికలు ఉండటం విశేషం అని తెలిపారు. మరి మిగిలిన క్రీడల్లో కూడా సుమారు 33 మంది విద్యార్థులు అన్ని క్రీడాంశాలలో జిల్లా స్థాయి పోటీలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మా యాజమాన్యం చదువులతో పాటుగా సమానంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని అందుకు నిదర్శనం ఈ క్రీడాకారులు అని తెలిపారు. మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశారు. స్కూల్ డైరెక్టర్స్ డాక్టర్ ఇన్న రెడ్డి , శ్రీమతి మంజుల , కిరణ్ కుమార్ రెడ్డి, అమెరికాలో ఉన్నప్పటికీ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ క్రీడల్లో సాధించే పథకాలు ఉన్నత చదువుల కొరకు ఉపయోగపడతాయని, ఉద్యోగాలలో ఉపయోగపడతాయని అన్నారు . రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలలో రెండు శాతం ఉద్యోగాలలో రాయితీ కూడా ఉన్నదని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో ప్రబలుతున్న రోగాలు రాకుండా కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో రోజుకు ఒక గంట అయినా ఆడాలని కూడా సూచించారు. ముఖ్యంగా మా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అలాగే చదువుతోపాటు క్రీడలను కూడా గౌరవిస్తూ ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకి గుడ్ షెఫర్డ్ యాజమాన్యం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్చార్జి డి వెంకట్రావు, ప్రైమరీ ఇన్చార్జి నాగమల్లేశ్వరి, ప్రమీల మరియు స్కూలు వ్యాయామ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : జిల్లాకు ఎంపికైన గుడ్ షెఫర్డ్ విద్యార్థులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version