Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ డస్ట్ బిన్ గా మారుతున్న మహాత్ముని విగ్రహ ప్రాంతం

డస్ట్ బిన్ గా మారుతున్న మహాత్ముని విగ్రహ ప్రాంతం

0

డస్ట్ బిన్ గా మారుతున్న మహాత్ముని విగ్రహ ప్రాంతం

న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక ఎన్నార్టీ రోడ్డు లోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి తడికలు అడ్డంపెట్టడం, కర్రలు గాంధీ వెనుక ఆనించి చుట్టూ కొబ్బరి బొండాల వేస్ట్ ను వేసి గాంధీ విగ్రహం దిమ్మె పైన వాటర్ క్యాన్లు అనేకం పెట్టడం జరిగింది. మనకు స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టిన మహానుభావుడికి మనమిచ్చే గౌరవం ఇదేనా అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము సూటి ప్రశ్న వేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో పెట్రోల్ బంకు పక్కన ఉన్న గాంధీ విగ్రహం చుట్టూ అపరిశుభ్రంగా ఉండటం గమనించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి చుట్టుపక్కల ఉన్న తడికలు, కర్రలు, చెత్తాచెదారం అంతా ఎత్తి పక్కన పడేసి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పాలతో శుభ్రంగా కడిగి పూలమాలను వేసి ఆయన పాదాల వద్ద పూలను ఉంచి మహానుభావా మమ్మల్ని క్షమించు మాకు మా స్వార్థం తప్ప వేరే ప్రపంచం లేదు కొంతమంది పెద్దలు జాతీయ నేతలు పేర్లు పెట్టుకొని వారి పేర్లకు కళంకం తెస్తున్నారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. దయచేసి ఎవరైనా జాతీయ నేతల విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటే మీరు ఏర్పాటు చేసే నేత విగ్రహాల యోగక్షేమాలు కూడా మీరు చూడగలము అనుకుంటేనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దయచేసి మున్సిపల్ అధికారులు జాతీయ నేతల విగ్రహాల వద్ద ఎవరన్నా తెలిసి తెలియక మేము తొలగించిన విధంగా వేస్టేనుపెడితే వెంటనే తొలగించవలసిందిగా మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేశారు. కొంతమంది స్వార్థపరులు జాతీయ నేతల విగ్రహాలను తమ స్వార్థం కోసం ఏర్పాటు చేస్తున్నారు అని అలాంటి వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అందరికీ అడ్వాన్స్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిన్ని బోయిన వెంకటేశ్వర్లు, చీరాల అంజయ్య, కాకర్ల కొండలు, సైదావలి, పొట్లూరు వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జునరావు, నరసింహ నాయక్, నర్ర వెంకటరత్నం, సుభాని, భద్రయ్య, మహమ్మద్ వలి, రామాంజనేయులు, గడ్డం సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. (Story : డస్ట్ బిన్ గా మారుతున్న మహాత్ముని విగ్రహ ప్రాంతం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version