Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఒక్క రోజులో అందరికీ ఎన్టీఆర్ భరోసా ఫించన్ మొత్తాల పంపిణీ

ఒక్క రోజులో అందరికీ ఎన్టీఆర్ భరోసా ఫించన్ మొత్తాల పంపిణీ

0

ఒక్క రోజులో అందరికీ ఎన్టీఆర్ భరోసా ఫించన్ మొత్తాల పంపిణీ

న్యూస్‌తెలుగు/విజయనగరం :జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ మొత్తాల పంపిణీ కార్యక్రమం మంగళవారం తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు అన్ని వార్డులు గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగింది. రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాసనసభ్యులు జిల్లా అధికారులు ఆయా మండలాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెంటాడ మండలం ఆండ్ర, లోతుగడ్డ గ్రామాల్లో పింఛన్ మొత్తాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో మంత్రి ఇంటింటికి వెళ్లి పెన్షన్ దారులకు పింఛను మొత్తాలను అందజేశారు.  గణపతి నగరం మండలం పురిటిపెంట, బొండపల్లి మండలం అంబటి వలస గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా పలువురు పించనుదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారికి ఎంత మొత్తం పింఛన్ గా వారికి అందుతుంది అనే వివరాలను తెలుసుకున్నారు పింఛన్ మొత్తం పంపిణీ చేసిన తర్వాత వారి నుంచి తగిన విధంగా ఎకనాలేడ్జ్ మెంట్ సిబ్బంది తీసుకుంటున్నది లేనిది పరిశీలించారు. 4000 పింఛను మొత్తం ఎన్ని నెలలుగా అందుతుందని పింఛను దారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఆర్డిఏ కార్యాలయంలో జిల్లాలో పింఛన్ పంపిణీ జరుగుతున్న తీరును కలెక్టర్ సమీక్షించారు. గజపతినగరంలో పోలంకి కృష్ణకుమారి అనే దివ్యంగురాలకి, కాసర రాధ అనే వృద్ధురాలికి పింఛన్ మొత్తాల పంపిణీ కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ, గజపతినగరం ఎంపీడీవో కిషోర్ కుమార్ తహసిల్దార్ రత్నకుమార్ తదితరులు ఉన్నారు. జిల్లాలోని వివిధ మండలాలు మున్సిపాలిటీల్లో జిల్లా స్థాయి అధికారులు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లాలో అక్టోబర్ నెలలో మొత్తం 2,78,240 మందికి పింఛన్ మొత్తాలు పంపిణీ చేయాల్సి ఉండగా మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రెండు లక్షల 70 వేల 130 మందికి పింఛన్ మొత్తాలు అందజేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 97.09 శాతం మందికి ఫించన్ మొత్తాల పంపిణీ పూర్తి అయ్యిందన్నారు. (Story : ఒక్క రోజులో అందరికీ ఎన్టీఆర్ భరోసా ఫించన్ మొత్తాల పంపిణీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version