Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కవి కోకిల గుర్రం జాషువా గృహ సందర్శన యాత్ర

కవి కోకిల గుర్రం జాషువా గృహ సందర్శన యాత్ర

0

కవి కోకిల గుర్రం జాషువా గృహ సందర్శన యాత్ర

న్యూస్‌తెలుగు/ వినుకొండ : మహాకవి, నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల గుర్రం జాషువా 129 వ జయంతి సందర్భంగా వారి స్వగ్రామం వినుకొండ సమీపానగల చాట్రగడ్డ పాడు లోని కవి గృహ సందర్శన యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు కేజే. రమేష్ తెలియజేశారు. ఈ యాత్రలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షురాలు ప్రముఖ రచయిత్రి డాక్టర్ సి. భవానీ దేవి, సంఘం ప్రధాన కార్యదర్శి ప్రముఖ రచయిత చలపాక. ప్రకాష్, కార్యదర్శి ఎస్ఎం. సుభాని, కోశాధికారి శ్రీ నానా, ఉపాధ్యక్షులు శ్రీ బొమ్మ. ఉమామహేశ్వర రెడ్డి, సంయుక్త కార్యదర్శి సోమేపల్లి .వశిష్ట , రాష్ట్ర నలుమూలల నుండి రచయితలు పాల్గొంటారని ప్రముఖ ఆంగ్ల రచయితలు కవులు అయినా. షేక్ స్పేర్, జాన్ కిడ్స్, పి.బి. షేల్లీ, వార్డ్స్ వెల్త్, లార్డ్ బైరన్, వంటి ప్రపంచస్థాయి సాహితీకారులు గృహాలను వారు సంచరించిన ప్రాంతాలను ఆయా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా స్మారక కేంద్రాలుగా సాంస్కృతిక పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారు. ప్రగతిశీల అభ్యుదయ భావాలతో సమ సమాజ చైతన్యానికి కలం పట్టి 50 కి పైగా కావ్యాలు రచించి జాతీయస్థాయిలో పద్మభూషణ్, కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, వంటి గౌరవాలు పొందిన మానవీయ కోణం కలిగిన మహాకవి గుర్రం. జాషువా, జన్మస్థలాన్ని గృహాన్ని ప్రభుత్వం గుర్తించి జాషువా జన్మించిన గ్రామంలో వారి రచనలతో పాటుగా ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పి భావితరాలకు జాషువా స్మారక మందిరం కవి స్మృతి చిహ్నంగా అందించాలని ఆశయంతో ఈ యాత్ర చేపట్టటం జరుగుతుందని ఈ యాత్రకు సంఘీభావంగా స్థానిక ఉపాధ్యాయులు కవులు కళాకారులు పాల్గొననున్నారని, ఈ గృహ సందర్శన యాత్రలో పాల్గొనే రచయితలు సాహిత్య అభిమానులు గృహ సందర్శన ద్వారా సాహిత్య పరంగా విశేష స్ఫూర్తికి పొందుతారని కవి కేజే రమేష్ తెలిపారు. (Story : కవి కోకిల గుర్రం జాషువా గృహ సందర్శన యాత్ర)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version