UA-35385725-1 UA-35385725-1

“క” సినిమా షూటింగ్ పూర్తి

“క” సినిమా షూటింగ్ పూర్తి

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా “క” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా టీమ్ కు తమ కృతజ్ఞతలు తెలిపారు దర్శకద్వయం సుజీత్, సందీప్. “క” సినిమా తమకు మెమొరబుల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చిందని వారు ఈ పోస్ట్ లో తెలిపారు. సుజీత్, సందీప్ స్పందిస్తూ – “క” సినిమా షూటింగ్ ఎక్సీపిరియన్స్ ను మాటల్లో చెప్పలేకపోతున్నాం. టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా మారిపోయాం. అహర్నిశలు సినిమా కోసం పనిచేశాం. మేమంతా ఇష్టంతో పనిచేయడం వల్ల ప్రతి కష్టంలోనూ హ్యాపీగా ఫీలయ్యాం. “క” సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది. షూటింగ్ పూర్తయినందుకు బాధగా ఉన్నా, రేపు “క” సినిమా అందించబోయే విజయాలకు హ్యాపీగా ఎదురుచూస్తున్నాం. మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అని అన్నారు.

ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.  “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్ (Story : “క” సినిమా షూటింగ్ పూర్తి) 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1