మొదటి భార్యను హత్య చేసినభర్త
న్యూస్‌తెలుగు/ సాలూరు : మొదటి భార్యను హత్య చేసిన సంఘటన సాలూరు మండలం ఖరసు వలస గ్రామంలో జరిగింది. సాలూరు రూరల్ పోలీస్ వారు ఇచ్చిన వివరాలు ప్రకారం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, కరాసవలస గ్రామానికి చెందిన బి శ్రీను కరాసమ్మ ఆనే మహిళను పదహారేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ల కిందట రాము అనే మహిళను శ్రీను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండు రోజుల క్రితం కరాసువలస గ్రామానికి రెండో భార్య అయిన రాము రావడం జరిగింది. విషయం తెలుసుకున్న మొదటి భార్య కరాసమ్మా రెండో భార్య అయిన రాము దగ్గరికి వెళ్లి గొడవ పడడం జరిగింది. రెండో భార్యతో గొడవ పడిన కరాసమ్మ ను శ్రీను గత నెల 29వ తేదీన పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న ఆమెను గొంతుకు చేర చుట్టి చంపేశాడు.కరాసమ్మ కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి నుండి ఇప్పటివరకు నిందితుడు శ్రీను పరారీలో ఉన్నాడు. మంగళవారం కుటుంబ సభ్యుల సమక్షంలో సాలూరు రూరల్ పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. మొదటి భార్యని చంపిన కేసులో అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కార్యక్రమంలో సాలూరు రూరల్ సిఐ రామకృష్ణ ఎస్సై నరసింహమూర్తి పాల్గొన్నారు. (Story : మొదటి భార్యను హత్య చేసినభర్త)