Home వార్తలు ‘ఊపిరి’ తర్వాత ‘సత్యం సుందరం’ హార్ట్ కి కనెక్ట్ అయ్యింది

‘ఊపిరి’ తర్వాత ‘సత్యం సుందరం’ హార్ట్ కి కనెక్ట్ అయ్యింది

0

‘ఊపిరి’ తర్వాత ‘సత్యం సుందరం’ హార్ట్ కి కనెక్ట్ అయ్యింది

 ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తి 
-27న దేవర ఫుల్ బాటిల్ తాగినంత హై ఇస్తే, 28న ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి సత్యం సుందరం మంచి రిఫ్రెష్మెంట్ ..రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావాలి: హీరో విశ్వక్ సేన్
-సత్యం సుందరం ట్రైలర్, టీజర్ చాలా నచ్చాయి. సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  
న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పెషల్ గెస్ట్ లు పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఐ లవ్ యు బ్రదర్స్. మీ ప్రేమకి థాంక్ యూ. మీరు లేకపోతే నేను లేను. ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చిన విశ్వక్, ప్రశాంత్ వర్మ, సురేష్ బాబు గారు, సునీల్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు సినిమాలంటే బాహుబలి లాంటి బిగ్ స్కేల్ సినిమాలు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజుల క్రితం ఇంకో ఐడెంటిటీ కూడా ఉండేది. కే విశ్వనాథ్ గారి సినిమాలు, పెద్దవంశి గారి సినిమాలు, వసంత కోకిల లాంటి సినిమాలు హార్ట్ కి క్లోజ్ అయిన ఎన్నో సినిమాలు ఇక్కడనుంచి వచ్చాయి. అలాంటి సినిమాలు చేయడం కుదరదా అనిపించేది. అప్పుడే 96 అనే అద్భుతమైన క్లాసిక్ సినిమా తీసిన డైరెక్టర్ దగ్గర నాకోసం ఒక కథ ఉందని విన్నాను. అయితే ఆ కథ ఆయన నాకు చెప్పలేదు. కారణం అడిగితే అందులో ఫైట్లు, లేవు డాన్స్ లేవు అని చెప్పారు. హీరోయిన్ నే లేని ఖైదీ సినిమా చేయలేదా ? అని చెప్పాను.(నవ్వుతూ) స్క్రిప్ట్ తీసుకు రమ్మని చెప్పాను. ఒక స్క్రిప్ట్ లా కాకుండా నవలలా తీసుకొచ్చారు. చదివినప్పుడు చాలాసార్లు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. కచ్చితంగా ఈ సినిమా చేస్తానని చెప్పాను. అన్నయ్య సూర్యకి ఈ స్క్రిప్ట్ ఇచ్చాను. ఆయనకి చాలా నచ్చింది. ఇలాంటి కథలు నీకే ఎలా దొరుతుతాయి? అని అన్నారు. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బావుంటుందని ఆయన దగ్గరికి తీసుకెళ్లాను. ఆయనకి చాలా నచ్చింది. ఇలాంటి కథ తన జీవితంలో జరిగిందని చెప్పారు. అది నాకు చాలా షాక్ అనిపించింది. అందరికీ పర్సనల్ గా కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చాలా ప్లాన్ గా షూట్ చేశారు. ప్రతిరోజు షూట్ ని ఎంజాయ్ చేశాం. ఖైదీ లానే నైట్ షూట్ ఉండే కథ ఇది. అరవింద్ అరవింద్ స్వామి గారు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. కమల్ హాసన్ గారు లాంటి పర్ఫామెన్స్ ని చేశారు. గోవింద్ వసంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అమ్మానాన్నలు బ్రదర్స్ సిస్టర్స్ ఎమోషన్స్ ని చూసాం. కానీ ఇప్పటివరకు కజిన్స్ ఎమోషన్ ని చూడలేదు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ వాళ్ల కజిన్స్ కి ఫోన్ చేసి మాట్లాడుతారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సునీల్ గారికి సురేష్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. 27 మా బ్రదర్ తారక్ దేవర సినిమా రాబోతుంది. తారక్ కి, తారక్ కి ఫ్యాన్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద హిట్ కొట్టాలి. దేవర వార్ ఫైర్ లాంటి పెద్ద సినిమా. మనది సిరిమల్లె చెట్టు లాంటి బ్యూటీఫుల్ ఫిల్మ్. ఈ సినిమాని చాలా మనసుపెట్టి చేశాం. అందరూ వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. శ్రీదివ్య..ఎక్కువగా మాట్లాడదు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇటీవల.. తమిళనాడులో భారీ వరదలు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునేందుకు విరాళాలు సేకరించాం. రూ.10 లక్షలు నటుల అసోషియేషన్‌ ఖాతాలో క్రెడిట్‌ అయ్యాయి. ఎవరు పంపించారా? అని చెక్‌ చేస్తే.. శ్రీదివ్య అని తెలిసింది. ఈ విషయం ఇప్పటి వరకూ చెప్పలేదు. తను చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. ఊపిరి నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఆ సినిమా తర్వాత సత్యం సుందరం చాలా స్పెషల్. మీడియా సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. నేను యాక్షన్ సినిమాలు చేస్తున్నాను. కానీ ఇలాంటి సినిమాలు రావడం చాలా కష్టం. 96 ఎలా అయితే హార్ట్ కి నచ్చిందో. సత్యం సుందరం కూడా మీ మనసుకి నచ్చుతుంది. తప్పకుండా అందరూ సినిమా చూడండి. అందరికీ థాంక్యూ’ అన్నారు
మాస్ కా దాస్ విశ్వక్సేన్ మాట్లాడుతూ.. కార్తి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని మా తెలుగు హీరో అని చెప్పుకుంటాం. సురేష్ బాబు గారి హ్యాండ్ తోనే నా కెరియర్ స్టార్ట్ అయింది. మా ఫేవరెట్ ప్రొడ్యూసర్ సునీల్ గారు, వారిని ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. 96 సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ఒక లవ్ స్టోరీ అయినప్పటికీ మాస్ సినిమా లెవెల్ లో ఆ సినిమాకి విజిల్స్, అరుపులు రెస్పాన్స్ వచ్చింది. నా ఫేవరెట్ ఫిలిం అది. ప్రేమ్ కుమార్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. 28న డెఫినెట్ గా ఈ సినిమా చూడండి. అలాగే 27న దేవర చూడండి. రెండు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. 27న ఫుల్ బాటిల్ తాగినంత హ్యాంగ్ ఓవర్ వస్తే, 28న ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి ఒక మంచి రెఫ్రిస్మెంట్ లాంటి సినిమా సత్యం సుందరం. రెండు సినిమాలు కి ఆల్ ది వెరీ బెస్ట్.’అన్నారు
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని నెలల క్రితమే కార్తీ గారిని కలిసాను. పీవీసియు లో ఆయన్ని కూడా చూస్తామేమో. కథ చెప్పాను. ఆయన ఓకే చేయడమే మిగిలుంది. ప్రేమ్ కుమార్ గారి 96 సినిమా నాకు చాలా స్పెషల్. గోవింద్ వసంత ఆ సినిమా చూసిన తర్వాత నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఈవెంట్ కి వచ్చే ముందు కూడా 96 పాటలు విన్నాను. కార్తీక్ గారు యాక్టింగ్ చూస్తున్నప్పుడు తెలియకుండానే ఫేస్ పై ఒక స్మైల్ వస్తుంది. ట్రైలర్, టీజర్ చాలా నచ్చాయి. సినిమా చూడ్డానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సునీల్ గారికి సురేష్ బాబు గారికి ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ థాంక్యు’ అన్నారు
హీరోయిన్ శ్రీదివ్య మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సత్యం సుందరం మా టీంకే కాదు చూసే ఆడియన్స్ అందరికీ స్పెషల్ అవుతుంది. 96 కంటే ఎక్కువ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను. సూర్య సార్ కి ఈ సినిమా చూశాక మాటలు రాలేదని విన్నాను. అలాగే విజయ్ సేతుపతి గారు కూడా ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇవన్నీ విన్నాక సినిమా చూడాలని చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. ప్రేమ్ కుమార్ గారికి థాంక్యూ. యుగానికి ఒక్కడు సినిమా చూసినప్పుడే కార్తీక్ గారు నాకు చాలా నచ్చేసారు. నా ఫేవరెట్ యాక్టర్ తో వర్క్ చేయడం నాకు ఎప్పుడూ హ్యాపీ. అని చాలా సపోర్ట్ గా ఉంటారు. మా టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడండి’ అన్నారు.
డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా స్పెషల్. ఆర్య జగడం సినిమాలతో నా కెరీర్ ని ఇక్కడే స్టార్ట్ చేశాను. తర్వాత షిఫ్ట్ అయ్యాను. నేను జూనియర్ ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్ ని. దేవర కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సినిమాని మా గురువుగారు రత్నవేలు గారు షూట్ చేశారు. అది చాలా స్పెషల్. ఈ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లందరికీ థాంక్యూ. అందరం 28న థియేటర్స్ లో కలుద్దాం.’ అన్నారు
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కార్తీ లైక్ ఏ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు మేము కలిసి వర్క్ చేసాము. కార్తీ సూర్య రానా మంచి ఫ్రెండ్స్. కార్తి విష్ యు ఆల్ ది బెస్ట్. 96 వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ. సత్యం సుందరం లో కూడా ఆ ఎమోషన్ ఏంటో చూడాలనే ఎక్సైట్ మెంట్ నాలో ఉంది. చాలా హార్ట్ ఫుల్ గా తీసిన సినిమా ఇది. డాక్టర్ ప్రేమ్ కుమార్ కి నా అభినందనలు. ఇది గ్రేట్ ఫిలిం కాబోతుంది. కార్తీ ఏడిస్తే సినిమా హిట్ అయిపోద్ది(నవ్వుతూ).వి డు అవర్ బెస్ట్ విల్ మేక్ థిస్ ఫిల్మ్ యాజ్ గుడ్ యాజ్ పాజిబుల్’ అన్నారు.
రాకేందు మౌళి మాట్లాడుతూ.. అందరికీ హాయ్. ఈ సినిమాకి సత్యం సుందరం అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అందరి మదిలో నిలిచిపోయే సినిమా ఇది. మనసుకు నచ్చిన సినిమా ఇది. సినిమా చూసి కార్తీగారికి కాల్ చేసి నా ఆనందాన్ని పంచుకున్నాను. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కూడా అదే చెప్పాను. చాలా స్వీట్ అండ్ నైస్ ఫిలిం ఇది. మర్చిపోలేని ఒక సినిమా అవుతుంది. కార్తీక్ గారు అరవింద్ స్వామి గారి మధ్య కెమిస్ట్రీ మైండ్ బ్లోయింగ్. ఒక జీవితాన్ని చూసిన అనుభూతిని ఇస్తుంది. చాలా డిపెస్ట్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. నాకు ఈ సినిమా రాయడానికి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో కార్తీగారు చాలా స్పెషల్. ఆడియన్స్ మర్చిపోలేనంత స్పెషల్. ఆ క్యారెక్టర్ తో లవ్ లో పడిపోతారు. దేవర చూసిన వెంటనే ఈ సినిమాను కూడా చూసేయండి. థాంక్యూ సో మచ్’ అన్నారు. (Story : ‘ఊపిరి’ తర్వాత ‘సత్యం సుందరం’ హార్ట్ కి కనెక్ట్ అయ్యింది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version