Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

0

సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్

న్యూస్‌తెలుగు/ వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాలను వాడవాడలా అన్ని పట్టణ గ్రామ శాఖలలో ఘనంగా నిర్వహించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం లోని పార్వతీపురం గ్రామం లో సోమవారం నాడు దూపాటి మార్కు అధ్యక్షతన జరిగిన శాఖ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం దేశ ప్రజల బంధనాల విముక్తి కోసం స్వాతంత్ర్య ఉద్యమంలో తెల్లదొరలను ఎదిరించుటకు వెనకడుగు వేయక యువ కమ్యూనిస్టుల బలిదానాలతో అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో సాగించిన స్వాతంత్ర్య సంగ్రామంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిదని స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ప్రజలకు పట్టడన్నం పెడుతున్న రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తమ రెక్కలను ముక్కలు చేసుకొని సంపదను సృష్టిస్తున్న కార్మికులు కష్టజీవుల శ్రమకు తగ్గ ఫలితాన్ని సంపదను ఆ కష్టజీవులకు న్యాయపరంగా పంపిణీ జరగటం కోసం పేద బడుగు బలహీన వర్గాలు నిమ్నజాతుల అభ్యున్నతి కోసం మత సామరస్యం కోసం ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతూ పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశం లో శ్రమజీవుల పోరాటాలలో పాల్గొని వారి హక్కుల సాధనలో నిరంతరం శ్రమించి పోరాడిందని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాదిమంది కమ్యూనిస్టులను బలిదానం చేసిందని బాల్చన్ దొర నీ కాల్ముక్త దొర అన్న పేదలను చేరదీసి దొరలను జాగీర్ దారులను రజాకారులను తరిమి కొట్టి పేద రైతాంగానికి 10 లక్షల ఎకరాల భూములను సెంటు కుంట లేని పేద రైతులకు పంపిణీ చేసిందని ఆయన అన్నారు. రాజభరణాల రద్దు చేయాలని సంస్థానాలను రద్దు చేయాలని భూమి లేనివారికి బంజరు సర్కారు భూములు పంపిణీ చేయాలని సుదీర్ఘ పోరాటం చేసి లక్షలాదిమందికి భూ పంపిణీ మహోద్యమాన్ని నిర్వహించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు గృహాలు నిర్మించి ఇవ్వాలని పోరాడి విజయం సాధించిందని ఆయన అన్నారు. కుల మత వర్గ పోరాటాలు నశించాలని భిన్నత్వంలో ఏకత్వంగా అందరినీ కలుపుకుపోయే సమైక్య జీవనం సాగించుటకు కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారని ఆయన అన్నారు. అటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు దాటి 100 వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా శతవార్షికోత్సవాలు జరుపుకోవాలని సిపిఐ జాతీయ పార్టీ పిలుపుమేరకు డిసెంబర్ మాసంలో శత వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతాయని దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ నగర పట్టణ మండల గ్రామ శాఖల సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను చైతన్యవంతులను గావించి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలకు పునరంగిటం కావాల్సిందిగా ఆయన కోరారు. సమావేశంలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా బొల్లాపల్లి మండలంలో మంచినీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నాగార్జునసాగర్ కుడి కాలువ ఆ మండలంలో ఆయా గ్రామాల గుండా వెళుతున్నప్పటికిని అచ్చటి ప్రజలకు మంచినీరు లేక పశువులకు గొర్రెలకు మేకలకు నీరందక అచ్చటి పేద ట్రైబల్ వర్గాలు బీసీలు ఎస్సీల ప్రజలు అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు. దశాబ్దాలుగా వరికపుడిశెల ప్రాజెక్టు శంకుస్థాపనలకే పరిమితమైందని అలా కాకుండా నూతన ప్రభుత్వం వరికపుడిశాల ప్రాజెక్టును సత్వరమే నిధులు కేటాయించి ప్రారంభించాలని తద్వారా మాచర్ల దుర్గి కారంపూడి బొల్లాపల్లి పుల్లలచెరువు మండలాలకు మంచినీరు సాగునీరు అందుతుంది కావున ఆ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామ శివారు పార్వతీపురం పల్లెలో పక్కనే గుళ్ళ కమ్మనది ప్రవహిస్తున్నను మంచినీరు లేక పల్లెలోని ప్రజలు అల్లాడిపోతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి పార్వతీపురం పల్లెకు మంచినీటి పైపులను బిగించాలని మండలంలోని ఇతర గ్రామాల కు పల్లె ప్రాంతాలకు మంచినీటి సరఫరా తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ గ్రామంలోని మంచినీటి పైపులైను వెంటనే బిగించాలని కరెంటు లైన్ బాగు చేయాలని రోడ్లు సైడ్ కాలవలు నిర్మించాలని తీర్మానించారు. సమావేశంలో సోమవరపు దావీదు సాల్మన్ రాజు మార్కు ,కోటేశ్వరరావు జయ రావు తదితరులు పాల్గొన్నారు. (Story : సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version