ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం నిర్వపించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆయా శాఖల అధికారులు స్వయంగా ఫీల్డ్‌కి వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారని, ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ సంతృప్తికరమైన పరిష్కారం వచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో క్లోజ్ చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వ్యర్ధాలు తొలగింపు, ఇంటి పన్ను, హోటల్స్‌పై ఫిర్యాదు చేయగా అనధికారి ఆక్రమణలు, ఆస్థి పన్ను వంటి సమస్యలపై ఫిర్యాదులు రావటం జరిగిందని ఆయా ఫిర్యాదులకు సత్వర సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పన్ను సంబంధిత 4 ఫిర్యాదులు అందగా, పట్టణ ప్రణాళికకు 3, ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖకు సంబందించి ఒక్క ఫిర్యాదు వచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు)