Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 15వ డివిజన్‌లో తల్లికి వందనం

15వ డివిజన్‌లో తల్లికి వందనం

0

15వ డివిజన్‌లో తల్లికి వందనం

న్యూస్‌ తెలుగు/విజయవాడ : కృష్ణలంక 15 డివిజన్‌లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో తల్లులు పట్ల పిల్లలకు ఉండే ప్రేమ, గౌరం, భాద్యతలను తెలియజేసే తల్లికి వందనం కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గం 15 డివిజన్‌ రామలింగేశ్వర నగర్‌లోని అంగన్వాడి కేంద్రంలో సోమవారం జరిరగిన తల్లికి వందనం కార్యక్రమంలో తల్లులకు పిల్లల పాదాలు కడిగి వందనం చేశారు. అనంతరం తల్లులు తమ వంతుగా పిల్లలను అక్షింతలతో ఆశీర్వదించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై తల్లులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిగా పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ మాట్లాడుతూ తల్లితండ్రులు పిల్లలకు ప్రత్యేక దైవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ సుమలత, అంగన్వాడి టీచర్లు బీ.ఎల్లరాణి, రaాన్సీ, టీ.నాగశ్రీ, వాణి, శారద, హెల్త్‌ సెక్రెటరీ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. (Story : 15వ డివిజన్‌లో తల్లికి వందనం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version