శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీహాస్పిటల్ లో 2 కె వాక్
న్యూస్‌తెలుగు/వినుకొండ : శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ వారు నిర్వహించు 2కె వాక్
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ నెల 29 న గుండెపరంగా వాకింగ్ ప్రాముఖ్యత తెలపటానికి శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ వారు 2 కే వాక్ నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు.. ఈ యొక్క 2 కె వాక్ ను వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభిస్తారు. ఈ 2 కె వాక్ వినుకొండ నగరంలో గల బస్టాండ్ పక్కన ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ప్రారంభమై, ఏనుగుపాలెం రోడ్డులో గల శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ముగుస్తుంది. ఈ 2 కె వాక్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది. అనంతరం ఏనుగుపాలెం రోడ్డులో గల శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్దకు చేరుకుని అక్కడ ఒక అరగంటసేపు గుండెపోటు, దాని లక్షణాలు మీద ఒక అరగంట సేపు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. తదుపరి అల్పాహారంతో ముగుస్తుంది. ఈ యొక్క 2 కె వాక్ లో పాల్గొనే సభ్యులందరూ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించవలసిన నెంబర్లు 92811 07993, 9281107992. మొదట 400 (నాలుగు వందల) మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఒక టీ షర్ట్ క్యాప్ మరియు 2000 రూపాయల విలువగల గుండె పరీక్షలు, (ఈసీజీ 2 డి ఏచో , బీపీ, షుగర్ డాక్టర్ కన్సల్టేషన్) కూపను ఉచితంగా ఇవ్వబడును. అవసరమైన వారికి ఉచితంగా యాంజియోగ్రామ్ చేయబడును కావున తామందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాల్సిందిగా కోరారు. (Story : శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీహాస్పిటల్ లో 2 కె వాక్ )