Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ లయోలా హై స్కూల్ లో ఆటల పోటీలు

లయోలా హై స్కూల్ లో ఆటల పోటీలు

0

లయోలా హై స్కూల్ లో ఆటల పోటీలు

న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక లయోలా హై స్కూల్ నందు విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఆటల పోటీలు (ఎస్ జి ఎఫ్) సోమవారం నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గ పు స్థాయిలో మొదటి రోజు గేమ్స్ నిర్వహించారు. స్కూల్ గేమ్స్ నియోజకవర్గం ఇన్చార్జి జి. వీరాంజనేయులు మొదటి రోజు వాలీబాల్, కోకో, కబాడీ, చెస్, బ్యాట్మెంటన్, యోగ ,లో అండర్ 14- అండర్ 17- బాల బాలికలకు ఎంపిక పోటీలు జరిగాయి. ఎంపికైన క్రీడా జట్టు ఈ నెల ఆఖరులో జరిగే ఉమ్మడి గుంటూరు జిల్లా జట్లు ఎంపికకు అర్హత సాధించారు. మంగళవారం రన్స్, జేమ్స్, త్రోస్, ఎంపిక పోటీలు ఉంటాయి. ఐదు మండలాలలో ఎంపికైన క్రీడాకారులు సుమారు 700 మంది విద్యార్థులు మరియు 40 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడాకారులుకు భోజన వసతి కల్పించారు. (Story : లయోలా హై స్కూల్ లో ఆటల పోటీలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version