పేద ప్రజలకు వైద్యం చేయడమే నిజమైన సంతృప్తి ఉంది
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పేద ప్రజలకు వైద్యం చేయడంలో నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిబిరం చైర్మన్ డివి వెంకటేశులు (చిట్టి), అధ్యక్షులు బంధనాదం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ ,సహకార దర్శి బండి నాగరాజు మాట్లాడుతూ పట్టణంలోని తొగటవీధిలో శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయంలో 103వ ఉచిత వైద్య శిబిరమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రముఖ డాక్టర్ల అయినా డాక్టర్ జైదీప్ నేత, డాక్టర్ వెంకటేశులు, డాక్టర్ సతీష్, డాక్టర్ విట్టల్ 260 మందికి వైద్య చికిత్స లను అందిస్తూ, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగిందన్నారు.శిబిరమును నిర్వహిస్తూ, అదేవిధంగా ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి దాతలుగా శీలం సావిత్రమ్మ, శీలం శ్రీ రాములు వారి కుమారుడు శీలం రమ్య నాగిని, శీలం జయ ప్రకాష్ నిర్వహించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసి వారి పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించడం జరిగిందన్నారు. దాతల సహాయ సహకారాలతోనే ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టు మేకల శివయ్య, బండి ఆంజనేయులు, బందనాదం చిన్నికృష్ణ, పెద్దకోట్ల భాస్కర్, పెద్దకోట్ల విజయ్, ఫిజియోథెరపీ డాక్టర్ వినయ్ కుమార్, బండి పవన్, సాయి, సుశీలమ్మ, దాసరి వేణు తదితరులు పాల్గొన్నారు. (Story : పేద ప్రజలకు వైద్యం చేయడమే నిజమైన సంతృప్తి ఉంది)