దీపావళి నుంచి మూడు ఉచిత సిలిండర్లు గ్యాస్ పంపిణీ
న్యూస్ తెలుగు/ సాలూరు : మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణం 11 వ వార్డ్ లో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ 100 రోజుల్లో సాలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడుపుతున్నామని ఎన్నికల్లో ఇచ్చిన హమీల భాగంగా అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. దీపావళి నుంచి మహిళలకు మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఆర్థికంగా ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్దిని చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని, ప్రతీ వార్డ్ ను అభివృద్ధి చేసుకునేందుకు వందరోజుల పండుగను ప్రజల మధ్య జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే మే నెలలో పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి మొదటి నెల ప్రతి ఇంటికి వెళ్లి 7వేల రూపాయల పెన్షన్ ను అందజేశామన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. . గత ప్రభుత్వంలో పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసిపి ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వంలో పంచాయితీలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. పేద ప్రజల కడుపు నింపడానికి అన్న క్యాoటీన్లను పునరుద్ధరించామన్నారు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై గత ప్రభుత్వ నాయకుల ఫోటోలను తొలగించి ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని వివరించారు .
మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమం పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మది చిట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కేతిరెడ్డి చంద్ర .భాను అధికారులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి కార్యకర్తలు, నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..